API in Action
		
				మసకొని రేఁగుబండ్లకును మౌక్తికముల్ వెలబోసినట్లు దు
				ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా
				రసనకుఁ బూతవృత్తిసుకరంబుగఁ జేకురునట్లు వాక్సుధా
				రసములు చిల్కఁ బద్యముఖరంగమునందు నటింపవయ్య సం
				తసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 
		
		
				శ్రీరమణీయహార యతసీకుసుమాభశరీర భక్తమం
				దార వికారదూర పరతత్త్వవిహార త్రిలోకచేతనో
				ద్ధార దురంతపాతకవితానవిదూర ఖరాదిదైత్యకాం
				తార కుఠార భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 
		
		
				కలఁ గంటిన్ వనమాలిని
				దలపై శిఖిపింఛ మొండు - ధరియించె జడన్
				హళది దుకూలమ్ముఁ దొడిఁగి
				వలపుల మణికరముతోడఁ - బరిరంభించెన్