రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద
శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో
ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
రంగదరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరో త్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ స త్సంగ ధరాత్మజాహృదయసారసభృంగ నిశాచరాబ్జమా తంగ శుభాంగ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!