భాస్కర శతకము
మారవి వెంకయ్య కవి
  1. చంపకమాల: 93%(43/46)
    ఒరిగిన వేళ నెంతటి ఘనుండును దన్నొక రొక్క నేర్పుతో
    నగపడి ప్రోదిసేయక తనంతట బల్మికిరాడు నిక్కమే;
    జగమున నగ్నియైనఁ గడు సన్నగిలంబడియున్న, నింధనం
    బెగయెఁగ ద్రోచి యూదక మఱెట్లు రవుల్కొన నేర్చు భాస్కరా!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    2ప్రాసరిగ
    3ప్రాసరిగ
    4ప్రాసరిగ
    గణ విభజన
    ✔న జ భ జ జ జ ర
    | | | | U | U | | | U | | U | | U | U | U
    ఒ రి గి న వే ళ నెం త టి ఘ నుం డు ను ద న్నొ క రొ క్క నే ర్పు తో
    ✘న జ భ జ జ జ ర
    | | | | U | U | | | U | | U | | U | U | U
    న గ ప డి ప్రో ది సే య క త నం త ట బ ల్మి కి రా డు ని క్క మే
    ✘న జ భ జ జ జ ర
    | | | | U | U | | | U | | U | | U | U | U
    జ గ ము న న గ్ని యై నఁ గ డు స న్న గి లం బ డి యు న్న నిం ధ నం
    ✘న జ భ జ జ జ ర
    | | | | U | U | | | U | | U | | U | U | U
    బె గ యెఁ గ ద్రో చి యూ ద క మ ఱె ట్లు ర వు ల్కొ న నే ర్చు భా స్క రా
  2. చంపకమాల
    చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
    చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
    బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
    పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!
  3. చంపకమాల
    తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకి చేకొనన్
    వలయు నటైన దిద్దు కొనవచ్చు ప్రయోజన మాంద్య మేమియుం
    గలగదు; ఫాలమందుఁ దిలకం బిడు నప్పుడు చేత నద్దముం
    గలిగిన చక్కఁ జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా!
  4. చంపకమాల
    ఉరుగుణవంతుఁ డొండు తనకొండపకారము సేయునప్పుడుం
    బరహితమే యొనర్చు నొక పట్టున నైనను గీడుఁ జేయఁ గా
    నెఱుఁగడు నిక్కమే కద; యదెట్లనఁ గవ్వము బట్టి యెంతయున్
    దరువఁగఁ జొచ్చినం బెరుఁగు తాలిమి నీయదె వెన్న, భాస్కరా!
  5. చంపకమాల
    బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే
    బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై
    జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా
    బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!
  6. ఉత్పలమాల
    సన్నుత కార్య దక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై
    యున్నపుడైన లోకులకు నొండొక మేలొపరించు; సత్వ సం
    పన్నుడు భీముడా ద్విజుల ప్రాణము కావడె ఏకచక్రమం
    దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా!
  7. ఉత్పలమాల
    పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్
    దూరములైన వాని యెడ దొడ్డగ చూతురు బుద్ధిమంతు లె
    ట్లారయ; గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె ఖ
    ర్జూర ఫలంబులన్ ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా!
  8. ఉత్పలమాల
    దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోటనుండి వే
    లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ, గల్ల గాదు, ప్ర
    త్యక్షము; వాగులున్ వరదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
    అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!
  9. చంపకమాల
    తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా
    ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
    లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి; తా
    ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా!
  10. ఉత్పలమాల
    ఊరక సజ్జనుండొదిగి యుండిననైన, దురాత్మకుండు ని
    ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
    చీరలు నూరు అంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ
    జేరి చినింగిపోఁ గొఱుకు చింమట కేమి ఫలంబు భాస్కరా!