కొన్ని ఆణిముత్యాలు
ఎందరో
  1. చంపకమాల
    అటజనికాంచెభూమిసురుడంబరచుంభశిరస్సరజ్ఝరీ
    పటలముహుర్ముహుర్ లుఠదభంగతరంగమృదంగనిశ్వన
    స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాపకలాపిజాలమున్
    ఘటకచరత్కరేణుకరకంపితసారముశీతసైలమున్
  2. తేటగీతి
    తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
    దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
    తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
    చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
  3. తేటగీతి
    తరువు లతిరసఫలభార గురుత గాంచు
    నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
    డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
    జగతి నుపకర్తలకు నిది సహజగుణము. ..!
  4. ఆటవెలది
    తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్లభుండ తెలు గొకండ;
    ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
    దేశభాష లందు తెలుగు లెస్స.
  5. తేటగీతి
    గగన భాగమ్ము ప్రావృష ద్విగుణ రోష
    ఘటిత నటనోగ్ర ధాటీ విఘటిత ప్రకట
    కుటిల ధూర్జటి ఘన జటా పటల నిటల
    వికట భృకుటీ కుటీర ముద్విగ్న మాయె.
  6. తేటగీతి
    భరత ఖండంబు చక్కని పాడి యావు
    హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
    తెల్లవారను గడుసరి గొల్లవారు
    పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి.
  7. కందం
    పలికెడిది భాగవతమట
    పలికించు విభుండు రామ భద్రుండట ;నే
    పలికిన భవహర మగునట
    పలికెద; వేరొండు గాథ పలుకగ నేలా!
  8. తేటగీతి
    అంబుజోదర దివ్య పాదారవింద
    చింతనామృత పాన విశేష మత్త
    చిత్తమే రీతి నితరంబు చేరనేర్చు
    వినుత గుణశీల మాటలు వేయునేల
  9. సీసం2
    ఘన ఘనాఘన గజ గ్రైవేయ ఘంటికా టంకారములకు ఘంటాపథంబు
    శక్రచా పోదగ్ర శార్దూల పాలనా విభవోన్నతికి భూరి విపిన సీమ
    చటుల ఝంఝా మరు ఛ్ఛతకోటి భేతాళ లుంఠన క్రియలకు రుద్రభూమి
    పటు తటిద్విలసన బ్రహ్మరాక్షస కఠోరాట్టహాసమున కహార్య బిలము
  10. సీసం2
    మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
    నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె తరంగిణులకు
    లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటజములకు
    పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు