సుమతీ శతకము
బద్దెన
  1. కందం
    అక్కరకురాని చుట్టము,
    మ్రొక్కిన వరమీన వేల్పు, మోహరమునదా
    నెక్కిన బాఱని గుఱ్ఱము,
    గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ.
  2. కందం
    అప్పిచ్చువాడు, వైద్యుడు,
    నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
    జొప్పడిన యూర నుండుము,
    చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
  3. కందం
    శ్రీరాముని దయచేతను
    నారూఢిగ సకల జనులు నౌరా యనగా
    ధారాళమైన నీతులు
    నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ.
  4. కందం
    కనకపు సింహాసనమున
    శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
    దొనరగ బట్టము గట్టిన
    వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ.
  5. కందం
    ఎప్పుడు సంపద కలిగిన
    నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్‌
    తెప్పలుగ జెఱువు నిండిన
    గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.
  6. కందం
    ఉపకారికి నుపకారము
    విపరీతము గాదు సేయ వివరింపంగా;
    నపకారికి నుపకారము
    నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.
  7. కందం
    ఎప్పటి కెయ్యది ప్రస్తుత
    మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌
    నొప్పించక, తా నొవ్వక,
    తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.
  8. కందం
    కమలములు నీట బాసిన
    కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌
    తమ తమ నెలవులు దప్పిన
    తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
  9. కందం
    అడిగిన జీతంబియ్యని
    మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌
    వడిగల యెద్దుల గట్టుక
    మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ
  10. కందం
    స్త్రీల ఎడ వాదులాడక
    బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
    మేలైన గుణము విడువకు
    ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!
  11. కందం
    సిరి దా వచ్చిన వచ్చును
    సలలితముగ నారికేళ సలిలము భంగిన్
    సిరి దాఁ బోయిన బోవును
    కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
  12. కందం
    మేలెంచని మాలిన్యుని
    మాలను నగసాలివాని మంగలి హితుగా
    నేలిన నరపతి రాజ్యము
    నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!
  13. కందం: 97%(38/39)
    సరసము విరసము కొరకే
    పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే
    పెరుగుట విరుగుట కొరకే
    ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    43మాత్ర45
    గణ విభజన
    ✔నల నల స
    | | | | | | | | | | U
    స ర స ము వి ర స ము కొ ర కే
    ✔స స నల భ స
    | | U | | U | | | | U | | | | U
    ప రి పూ ర్ణ సు ఖం బు అ ధి క బా ధ ల కొ ర కే
    ✔నల నల స
    | | | | | | | | | | U
    పె రు గు ట వి రు గు ట కొ ర కే
    ✘స స నగ భ స
    | | U | | U | | | U U | | | | U
    ధ ర త గ్గు ట హె చ్చు కొ ర కే త ధ్య ము సు మ తీ
  14. కందం
    శుభముల నొందని చదువును
    అభినయమున రాగరసము నందని పాటల్
    గుభగుభలు లేని కూటమి
    సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
  15. కందం: 90%(38/42)
    వేసరవు జాతి కానీ
    వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ
    దాసి కొడుకైన గాని
    కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    24యతివీవ్య
    33మాత్ర43
    44మాత్ర45
    44యతికాజు
    గణ విభజన
    ✔భ జ గా
    U | | | U | U U
    వే స ర వు జా తి కా నీ
    ✘భ గా జ భ గా
    U | | U U | U | U | | U U
    వీ స ముఁ దా జే య న ట్టి వ్య ర్థు డు గా నీ
    ✘భ జ హ
    U | | | U | U |
    దా సి కొ డు కై న గా ని
    ✘భ స గా నగ స
    U | | | | U U U | | | U | | U
    కా సు లు గ ల వాఁ డే రా జు గ ద రా సు మ తీ
  16. కందం
    వెలయాలు సేయు బాసలు
    వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్
    గలలోఁన గన్న కలిమియు,
    విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
  17. కందం
    వెలయాలివలనఁ గూరిమి
    గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా
    పలువురు నడిచెడి తెరుపునఁ
    బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
  18. కందం
    వీడెము సేయని నోరును
    జేడెల యధరామృతంబుఁ జేయని నోరును
    బాడంగరాని నోరును
    బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
  19. కందం: 97%(38/39)
    వినదగు నెవ్వరుచెప్పిన
    వినినంతనె వేగపడక వివరింపదగున్
    కనికల్ల నిజము దెలిసిన
    మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    41మాత్ర45
    గణ విభజన
    ✔నల భ భ
    | | | | U | | U | |
    వి న ద గు నె వ్వ రు చె ప్పి న
    ✔స స నల స స
    | | U | | U | | | | | | U | | U
    వి ని నం త నె వే గ ప డ క వి వ రిం ప ద గున్
    ✔స నల నల
    | | U | | | | | | | |
    క ని క ల్ల ని జ ము దె లి సి న
    ✘నగ గా నల స స
    | | | U U U | | | | | | U | | U
    మ ను జు డే పో నీ తి ప రు డు మ హి లో సు మ తీ
  20. కందం
    వరి పంటలేని యూరును
    దొరయుండని యారు తోడు దొరకని తెరువున్
    ధరను బతిలేని గృహమును
    అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
  21. కందం
    వరదైన చేను దున్నకు
    కరవైనను బంధుజనుల కడకేగకుమీ
    పరులకు మర్మము సెప్పకు
    పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
  22. కందం
    లావుగలవానికంటెను
    భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
    గ్రావంబంత గజంబును
    మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
  23. కందం: 87%(36/41)
    రూపించి పలికి బొంకకు
    ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
    గోపించురాజుఁ గొల్వకు
    పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర45
    4గణాల సంఖ్య54
    41మాత్ర47
    45మాత్ర40
    44యతిపాసు
    గణ విభజన
    ✘గా నల ర
    U U | | | | U | U
    రూ పిం చి ప లి కి బొం క కు
    ✔భ గా జ నల స
    U | | U U | U | | | | | | | U
    ప్రా ప గు చు ట్టం బు నె గ్గు ప లు క కు మ ది లోఁ
    ✔గా జ భ
    U U | U | U | |
    గో పిం చు రా జుఁ గొ ల్వ కు
    ✘రగురు నల నల స
    U | U U | | | | | | | | | | U
    పా పు దే శం బు సొ ర కు ప ది ల ము సు మ తీ
  24. కందం: 85%(35/41)
    రా పొమ్మని పిలువని యా
    భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే
    దీపంబు లేని ఇంటను
    చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    4గణాల సంఖ్య54
    41మాత్ర45
    42మాత్ర46
    45మాత్ర40
    44యతిచెసు
    4ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
    గణ విభజన
    ✔గా నల స
    U U | | | | | | U
    రా పొ మ్మ ని పి లు వ ని యా
    ✔గా స జ భ స
    U U | | U | U | U | | | | U
    భూ పా లు నిఁ గొ ల్వ ము క్తి ము క్తు లు గ ల వే
    ✔గా జ భ
    U U | U | U | |
    దీ పం బు లే ని ఇం ట ను
    ✘నగ రల భ స
    | | | U U | U | U | | | | U
    చె వు ణి కీ ళ్లా డి న ట్లు సి ద్ధ ము సు మ తీ
  25. కందం: 83%(36/43)
    నాది నొకని వలచియుండగ
    మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్
    బొది జిలుక పిల్లి పట్టిన
    జదువునె యా పంజరమున జగతిని సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    1గణాల సంఖ్య34
    2ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
    3ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
    4ప్రాస పూర్వాక్షరంగురువులఘువు
    13బేసి గణం'జ' కానిదిజ
    32బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✘భ నల జ ల
    U | | | | | | | U | |
    నా ది నొ క ని వ ల చి యుం డ గ
    ✘నల స నల భ స
    | | | | | | U | | | | U | | | | U
    మ ది చె డి యొ క క్రూ ర వి టు డు మా న క తి రు గున్
    ✘నల జ భ
    | | | | | U | U | |
    బొ ది జి లు క పి ల్లి ప ట్టి న
    ✘నల గా నల నల స
    | | | | U U | | | | | | | | | | U
    జ దు వు నె యా పం జ ర ము న జ గ తి ని సు మ తీ
  26. కందం
    మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
    హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
    మానెడు జలములలోపల
    నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!
  27. కందం
    మాటకు బ్రాణము సత్యము
    కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
    బోటికిఁ బ్రాణము మానము
    చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
  28. కందం
    మంత్రిగలవాని రాజ్యము
    తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో
    మంత్రి విహీనుని రాజ్యము
    జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!
  29. కందం
    మండలపతి సముఖంబున
    మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్
    గొండంత మదపుటేనుగు
    తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!
  30. కందం
    బలవంతుడ నాకేమని
    పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
    బలవంతమైన సర్పము
    చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
  31. కందం
    బంగారు కుదువబెట్టకు
    సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో
    నంగడి వెచ్చములాడకు
    వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!
  32. కందం
    పొరుగున పగవాడుండిన
    నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్
    ధరఁగాఁపు కొండెమాడినఁ
    గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
  33. కందం
    పెట్టిన దినములలోపల
    నట్టడవులకైనవచ్చు నానార్థములున్
    బెట్టని దినములఁ గనకపు
    గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!
  34. కందం: 89%(35/39)
    పులిపాలు దెచ్చిఇచ్చిన
    నలవడఁగ గుండెగోసి యరచే నిడినం
    దలపొడుగు ధనము బోసిన
    వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    25మాత్ర43
    22బేసి గణం'జ' కానిదిజ
    23ఆరవ గణంజ or నలభ
    24బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✔స జ భ
    | | U | U | U | |
    పు లి పా లు దె చ్చి ఇ చ్చి న
    ✘నల జ భ జ వ
    | | | | | U | U | | | U | | U
    న ల వ డఁ గ గుం డె గో సి య ర చే ని డి నం
    ✔నల నల భ
    | | | | | | | | U | |
    ద ల పొ డు గు ధ న ము బో సి న
    ✔స స జ స స
    | | U | | U | U | | | U | | U
    వె ల యా లి కి గూ ర్మి లే దు వి ను రా సు మ తీ
  35. కందం
    పుత్రోత్సాహము తండ్రికి
    పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
    పుత్రుని కనుగొని పొగడగ
    పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
  36. కందం: 92%(36/39)
    పురికిని బ్రాణము కోమటి
    వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
    గరికిని బ్రాణము తొండము
    సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    43మాత్ర45
    45మాత్ర42
    44యతిసిద్ధ
    గణ విభజన
    ✔నల భ భ
    | | | | U | | U | |
    పు రి కి ని బ్రా ణ ము కో మ టి
    ✔నల గా జ నల గా
    | | | | U U | U | | | | | U U
    వ రి కి ని బ్రా ణం బు నీ రు వ సు మ తి లో నం
    ✔నల భ భ
    | | | | U | | U | |
    గ రి కి ని బ్రా ణ ము తొం డ ము
    ✘నల భ నగ నల గ
    | | | | U | | | | | U | | | | U
    సి రి కి ని బ్రా ణ ము మ గు వ సి ద్ధ ము సు మ తీ
  37. కందం: 97%(38/39)
    పిలువని పనులకు బోవుట
    కలయని సతి రతియు రాజు గానని కొలువు
    బిలువని పేరంటంబును
    వలవని చెలిమియును జేయవలదుర సుమతీ
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    25మాత్ర43
    గణ విభజన
    ✔నల నల భ
    | | | | | | | | U | |
    పి లు వ ని ప ను ల కు బో వు ట
    ✘నల నల జ భ న
    | | | | | | | | | U | U | | | | |
    క ల య ని స తి ర తి యు రా జు గా న ని కొ లు వు
    ✔నల గా భ
    | | | | U U U | |
    బి లు వ ని పే రం టం బు ను
    ✔నల నల జ నల స
    | | | | | | | | | U | | | | | | | U
    వ ల వ ని చె లి మి యు ను జే య వ ల దు ర సు మ తీ
  38. కందం: 97%(41/42)
    పాలసునకైన యాపద
    జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ
    దే లగ్నిబడగఁ బట్టిన
    మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    25మాత్ర43
    గణ విభజన
    ✔భ జ భ
    U | | | U | U | |
    పా ల సు న కై న యా ప ద
    ✘గా స నల గా న
    U U | | U | | | | U U | | |
    జా లిం బ డి తీ ర్పఁ ద గ దు స ర్వ జ్ఞు న కుఁ
    ✔గా నల భ
    U U | | | | U | |
    దే ల గ్ని బ డ గఁ బ ట్టి న
    ✔భ స జ భ స
    U | | | | U | U | U | | | | U
    మే లె రు గు నె మీ టు గా క మే ది ని సు మ తీ
  39. కందం: 92%(39/42)
    పాలను గలిసిన జలమును
    బాలవిధంబుననే యుండుఁ బరికింపగ
    బాల చవిఁజెరచు గావున
    బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    24మాత్ర45
    25మాత్ర42
    23ఆరవ గణంజ or నలగా
    గణ విభజన
    ✔భ నల నల
    U | | | | | | | | | |
    పా ల ను గ లి సి న జ ల ము ను
    ✘భ భ గా నగ లల
    U | | U | | U U | | | U | |
    బా ల వి ధం బు న నే యుం డుఁ బ రి కిం ప గ
    ✔భ నల భ
    U | | | | | | U | |
    బా ల చ విఁ జె ర చు గా వు న
    ✔భ స జ నల స
    U | | | | U | U | | | | | | | U
    బా ల సుఁ డ గు వా ని పొం దు వ ల దు ర సు మ తీ
  40. కందం: 97%(41/42)
    పాటెరుగని పతికొలువును
    గూటంబున కెరుకపడని కోమలిరతియు
    జేటెత్తజేయు చెలిమియు
    నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    25మాత్ర43
    గణ విభజన
    ✔భ నల నల
    U | | | | | | | | | |
    పా టె రు గ ని ప తి కొ లు వు ను
    ✘గా నల నల భ న
    U U | | | | | | | | U | | | | |
    గూ టం బు న కె రు క ప డ ని కో మ లి ర తి యు
    ✔గా జ నల
    U U | U | | | | |
    జే టె త్త జే యు చె లి మి యు
    ✔భ స జ భ స
    U | | | | U | U | U | | | | U
    నే టి కి నె ది రీ ది న ట్టు లె న్న గ సు మ తీ
  41. కందం
    పలుదోమి సేయు విడియము
    తలగడిగిన నాఁటినిద్ర తరుణులయెడలం
    బొలయలుక నాటి కూటమి
    వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ !
  42. కందం: 97%(41/42)
    పర్వముల సతులఁ గవయకు
    ముర్వీశ్వరుకరుణ నమ్మి యబ్బకు మదిలో
    గర్వింపనాలి బెంపకు
    నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    24యతిముయ
    గణ విభజన
    ✔భ నల నల
    U | | | | | | | | | |
    ప ర్వ ము ల స తు లఁ గ వ య కు
    ✘గా నల జ భ స
    U U | | | | | U | U | | | | U
    ము ర్వీ శ్వ రు క రు ణ న మ్మి య బ్బ కు మ ది లో
    ✔గా జ భ
    U U | U | U | |
    గ ర్విం ప నా లి బెం ప కు
    ✔భ స జ నల స
    U | | | | U | U | | | | | | | U
    ని ర్వ హ ణ ము లే ని చో ట ని లు వ కు సు మ తీ
  43. కందం: 97%(38/39)
    పరుల కనిష్టము సెప్పకు
    పొరుగిండ్లకు బనులులేక పోవకు మెపుడున్
    బరుఁగదిసిన సతి గవయకు
    ఎరింగియు బిరుసై సహయము నెక్కకు సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    42మాత్ర45
    గణ విభజన
    ✔నల భ భ
    | | | | U | | U | |
    ప రు ల క ని ష్ట ము సె ప్ప కు
    ✔స నల జ భ స
    | | U | | | | | U | U | | | | U
    పొ రు గిం డ్ల కు బ ను లు లే క పో వ కు మె పు డున్
    ✔నల నల నల
    | | | | | | | | | | | |
    బ రుఁ గ ది సి న స తి గ వ య కు
    ✘జ నగ నల భ స
    | U | | | | U | | | | U | | | | U
    ఎ రిం గి యు బి రు సై స హ య ము నె క్క కు సు మ తీ
  44. కందం: 92%(36/39)
    పరసతుల గోష్టినుండి
    పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్
    బరుసతి సుశీయైనను
    బరుసంగతినున్న నింద పాలగు సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర43
    32మాత్ర46
    33మాత్ర41
    గణ విభజన
    ✘నల జ హ
    | | | | | U | U |
    ప ర స తు ల గో ష్టి నుం డి
    ✔నల గా జ స స
    | | | | U U | U | | | U | | U
    పు రు షు డు గాం గే యు డై న భు వి నిం ద బ డున్
    ✘నల ? ల
    | | | | | U U | |
    బ రు స తి సు శీ యై న ను
    ✔స స జ భ స
    | | U | | U | U | U | | | | U
    బ రు సం గ తి ను న్న నిం ద పా ల గు సు మ తీ
  45. కందం
    పరసతి కూటమి గోరకు
    పరధనముల కాసపడకు పరునెంచకుమీ
    సరిగాని గోష్టి సేయకు
    సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ !
  46. కందం
    పరనారీ సోదరుఁడై
    పరధనముల కాసపడక పరులకు హితుడైఁ
    పరుల దనుఁబొగడ నెగడక
    పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ !
  47. కందం
    పనిచేయునెడల దాసియు
    ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
    దనభుక్తి యెడలఁ దల్లియు
    ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ !
  48. కందం
    పతికడకుఁ దన్నుగూర్చిన
    సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్
    సుతుకడకు రిత్తచేతుల
    మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ !
  49. కందం
    పగవల దెవ్వరితోడను
    వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
    దెగనాడవలదు సభలను
    మగువకు మనసీయవలదు మహిలో సుమతీ !
  50. కందం
    నవ్వకుమీ సభలోపల
    నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్
    నవ్వకుమీ పరసతితో
    నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ !
  51. కందం: 97%(38/39)
    నవరస భావాలంకృత
    కవితాగోష్ఠియును మధుర గానంబును
    నవివేకి కెంతఁజెప్పినఁ
    జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    25మాత్ర42
    గణ విభజన
    ✔నల గా భ
    | | | | U U U | |
    న వ ర స భా వా లం కృ త
    ✘స భ నల గా లల
    | | U U | | | | | | U U | |
    క వి తా గో ష్ఠి యు ను మ ధు ర గా నం బు ను
    ✔స జ భ
    | | U | U | U | |
    న వి వే కి కెం తఁ జె ప్పి నఁ
    ✔నల గా జ భ స
    | | | | U U | U | U | | | | U
    జె వి టి కి శం ఖూ ది న ట్లు సి ద్ధ ము సు మ తీ
  52. కందం
    నరపతుల మేరదప్పిన
    దిర మొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్
    గరణము వైదికుఁడయినను
    మరణాంతకమౌనుగాని మానదు సుమతీ !
  53. కందం: 92%(36/39)
    నవమున బాలుంద్రావరు
    భయమునను విషమ్మునైన భక్షింతురుగా
    నయమెంత దోసకారియె
    భయమే చూపంగవలయు బాగుగ సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    2ప్రాసవయ
    3ప్రాసవయ
    4ప్రాసవయ
    గణ విభజన
    ✔నల గా భ
    | | | | U U U | |
    న వ ము న బా లుం ద్రా వ రు
    ✘నల స జ గా స
    | | | | | | U | U | U U | | U
    భ య ము న ను వి ష మ్ము నై న భ క్షిం తు రు గా
    ✘స జ భ
    | | U | U | U | |
    న య మెం త దో స కా రి యె
    ✘స గా నల భ స
    | | U U U | | | | U | | | | U
    భ య మే చూ పం గ వ ల యు బా గు గ సు మ తీ
  54. కందం
    నమ్మకు సుంకరి జూదరి
    నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్
    నమ్మకు మంగలివానిని
    నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ !
  55. కందం: 82%(33/40)
    నడువకుమీ తెరువొక్కటఁ
    గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్
    ముడువకుమీ పరధనముల
    నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    2గణాల సంఖ్య54
    23మాత్ర46
    24మాత్ర45
    25మాత్ర40
    24యతిగుమి
    23ఆరవ గణంజ or నలరల
    గణ విభజన
    ✔నల భ భ
    | | | | U | | U | |
    న డు వ కు మీ తె రు వొ క్క టఁ
    ✘నల భ రల య
    | | | | U | | U | U | | U U
    గు డు వ కు మీ శ తృ నిం టఁ గూ రి మి తో డన్
    ✔నల భ నల
    | | | | U | | | | | |
    ము డు వ కు మీ ప ర ధ న ము ల
    ✔నల భ నల భ స
    | | | | U | | | | | | U | | | | U
    ను డు వ కు మీ యె రు ల మ న సు నొ వ్వ గ సు మ తీ
  56. త్రిపది: 70%(17/24)
    సారంబగు నారికేళ సలిలము భంగిన్
    గారవమును మరిమీదట
    భూరిసుఖావహము నగును భువిలో సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    12గణ స్వభావంఇంద్రతెలియదు
    14గణ స్వభావంఇంద్రతెలియదు
    24గణ స్వభావంసూర్యలఘువు
    3గణాల సంఖ్య36
    గణ విభజన
    ✘త ? నల య
    U U | | U | U | | | | | U U
    సా రం బ గు నా రి కే ళ స లి ల ము భం గిన్
    ✘భ నల హ ల
    U | | | | | | U | |
    గా ర వ ము ను మ రి మీ ద ట
    ✘భ భ న లల ? గ
    U | | U | | | | | | | | U | | U
    భూ రి సు ఖా వ హ ము న గు ను భు వి లో సు మ తీ
  57. కందం
    ధనపతి సఖుఁడై యుండియు
    నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్
    దనవారి కెంతకల గిన
    దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ !
  58. కందం
    చేతులకు దొడవు దానము
    భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
    నీతియ తొడ వెవ్వారికి
    నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ !
  59. కందం: 90%(40/44)
    దగ్గర కొండెము సెప్పెడు
    ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా
    నెగ్గుఁబ్రజ కాచరించుట
    బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర45
    3గణాల సంఖ్య34
    33బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✘భ భ ర
    U | | U | | U | U
    ద గ్గ ర కొం డె ము సె ప్పె డు
    ✔భ నల జ స స
    U | | | | | | | U | | | U | | U
    ప్రె గ్గ డ ప లు కు ల కు రా జు ప్రి యుఁ డై మ రి తా
    ✘గా స జ ల
    U U | | U | U | |
    నె గ్గుఁ బ్ర జ కా చ రిం చు ట
    ✔భ గా నల నల స
    U | | U U | | | | | | | | | | U
    బొ గ్గు ల కై క ల్ప త రు వు బొ డ చు ట సు మ తీ
  60. కందం: 97%(41/42)
    తాను భుజింపని యర్థము
    మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ
    గానల నీఁగల గూర్చిన
    దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    45మాత్ర45
    గణ విభజన
    ✔భ భ భ
    U | | U | | U | |
    తా ను భు జిం ప ని య ర్థ ము
    ✔భ స జ స స
    U | | | | U | U | | | U | | U
    మా న వ ప తిఁ జే రుఁ గొం త మ రి భూ గ త మౌఁ
    ✔భ భ భ
    U | | U | | U | |
    గా న ల నీఁ గ ల గూ ర్చి న
    ✘భ స జ నల నగ
    U | | | | U | U | | | | | | | | U
    దే ని య యె రుఁ జే రు న ట్లు తి ర గ ము న సు మ తీ
  61. కందం
    తలమాసిన నొలుమాసిన
    వలువలు మాసినను బ్రాన వల్లభునైనం
    గులకాంతలైన రోఁతురు
    తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ !
  62. కందం
    తలనుండు విషము ఫణికిని
    వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
    దలతోఁక యనక యుండును
    ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
  63. కందం
    తములము వేయని నోరును
    విమతులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్
    గమలములు లేని కొలకుఁను
    హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ !
  64. కందం
    తనవారు లేనిచోటను
    జనవించుక లేనిచోట జగడముచోటన్
    అనుమానమైన చోటను
    మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ !
  65. కందం: 86%(33/38)
    తన కలిమి ఇంద్రభోగము
    తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్
    తన చావు జతద్ప్రళయము
    తను వలచినదియె రంభ తథ్యము సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    4గణాల సంఖ్య54
    43మాత్ర46
    44మాత్ర45
    45మాత్ర40
    44యతితము
    గణ విభజన
    ✔నల జ భ
    | | | | | U | U | |
    త న క లి మి ఇం ద్ర భో గ ము
    ✔స స జ గా గా
    | | U | | U | U | U U U U
    త న లే మి యె స ర్వ లో క దా రి ద్య్రం బున్
    ✔స స నల
    | | U | | U | | | |
    త న చా వు జ త ద్ప్ర ళ య ము
    ✘నల నల రల నగ
    | | | | | | | | U | U | | | | U
    త ను వ ల చి న ది యె రం భ త థ్య ము సు మ తీ
  66. కందం
    తనయూరి తపసితనమును
    దనపుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్
    దన పెరటిచెట్టు మందును
    మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ !
  67. కందం: 97%(38/39)
    తన కోపమె తన శతృవు
    తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ
    తన సంతోషమె స్వర్గము
    తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర43
    గణ విభజన
    ✘స నల న
    | | U | | | | | | |
    త న కో ప మె త న శ తృ వు
    ✔స నల జ స గా
    | | U | | | | | U | | | U U U
    త న శాం త మె త న కు ర క్ష ద య చు ట్టం బౌఁ
    ✔స భ భ
    | | U U | | U | |
    త న సం తో ష మె స్వ ర్గ ము
    ✔స నల జ భ స
    | | U | | | | | U | U | | | | U
    త న దుః ఖ మె న ర క మం డ్రు త ధ్య ము సు మ తీ
  68. కందం
    తడ వోర్వక యొడలోర్వక
    కడువేగం బడచిపడినఁ గార్యంబగునే
    తడవోర్చిన నొడలోర్చినఁ
    జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ !
  69. కందం
    చేతులకు దొడవు దానము
    భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
    నీతియ తొడ వెవ్వారికి
    నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ !
  70. కందం
    చుట్టములు గానివారలు
    చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్
    నెట్టుకొని యాశ్రయింతురు
    గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ !
  71. కందం
    కొరగాని కొడుకు పుట్టినఁ
    కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుం
    జెరకు తుద వెన్నుఁపుట్టిన
    జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ !
  72. కందం
    కోమలి విశ్వాసంబును
    బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్
    వేముల తియ్యఁదనంబును
    భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ !
  73. కందం: 94%(37/39)
    గడనగల మననిఁజూచిన
    నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో
    గడ నుడుగు మగనిఁ జూచిన
    నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    25మాత్ర45
    24యతినచు
    గణ విభజన
    ✔నల నల భ
    | | | | | | | | U | |
    గ డ న గ ల మ న నిఁ జూ చి న
    ✘నల నల నల నల నగ
    | | | | | | | | | | | | | | | | | | | U
    న డు గ గ డు గు న మ డుఁ గు లి డు చు ర తి వ లు త మ లో
    ✔నల నల భ
    | | | | | | | | U | |
    గ డ ను డు గు మ గ నిఁ జూ చి న
    ✔స స నల నల స
    | | U | | U | | | | | | | | | | U
    న డు పీ నుఁ గు వ చ్చె న ను చు న గు దు రు సు మ తీ
  74. కందం: 92%(39/42)
    చీమలు పెట్టిన పుట్టలు
    పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్
    హేమంబుఁ గూడఁబెట్టిన
    భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ !
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    45మాత్ర43
    44యతిభూవి
    44బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✔భ భ భ
    U | | U | | U | |
    చీ మ లు పె ట్టి న పు ట్ట లు
    ✔భ స జ భ స
    U | | | | U | U | U | | | | U
    పా ము ల కి ర వై న య ట్లు పా మ రుఁ డు ద గన్
    ✔గా జ భ
    U U | U | U | |
    హే మం బుఁ గూ డఁ బె ట్టి న
    ✘గా స భ జ వ
    U U | | U U | | | U | | U
    భూ మీ శు ల పాఁ జే రు భు వి లో సు మ తీ
  75. త్రిపది2: 70%(14/20)
    గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
    కలకంఠి కంట కన్నీ
    రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    12గణ స్వభావంఇంద్రతెలియదు
    14గణ స్వభావంఇంద్రతెలియదు
    23గణ స్వభావంసూర్యగురువు
    3గణాల సంఖ్య35
    గణ విభజన
    ✘సల ? నగ స
    | | U | | U | U | | | U | | U
    గ ల హిం ప కు వ ట్టి త ప్పు ఘ టి యిం ప కు మీ
    ✘సల ర గ
    | | U | U | U U
    క ల కం ఠి కం ట క న్నీ
    ✘నల సల హ భల వ
    | | | | | | U | U | U | | | | U
    రొ లి కి న సి రి యిం ట నుం డ నొ ల్ల దు సు మ తీ
  76. కందం
    కూరిమిగల దినములలో
    నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
    కూరిమి విరసంబైనను
    నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!
  77. కందం
    కొంచెపు నరుసంగతిచే
    నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్
    గించిత్తు నల్లి కుట్టిన
    మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!
  78. కందం: 90%(38/42)
    కారణములేని నగవును
    బేరణమును లేని లేమ పృథివీస్థలిలో
    బూరణము లేని బూరెయు
    వీరణములేని పెండ్లి వృధరా సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    45మాత్ర43
    44యతివీధ
    42బేసి గణం'జ' కానిదిజ
    44బేసి గణం'జ' కానిదిజ
    గణ విభజన
    ✔భ జ నల
    U | | | U | | | | |
    కా ర ణ ము లే ని న గ వు ను
    ✔భ స జ స స
    U | | | | U | U | | | U | | U
    బే ర ణ ము ను లే ని లే మ పృ థి వీ స్థ లి లో
    ✔భ జ భ
    U | | | U | U | |
    బూ ర ణ ము లే ని బూ రె యు
    ✘భ జ భ జ వ
    U | | | U | U | | | U | | U
    వీ ర ణ ము లే ని పెం డ్లి వృ ధ రా సు మ తీ
  79. కందం
    కాముకుడు దనిసి విడిచిన
    కోమలి బరవిటుడు గవయ గూడుట యెల్లన్
    బ్రేమమున జెరకు పిప్పికి
    జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!
  80. కందం
    కాదు సుమీ దుస్సంగతి
    పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
    వాదుసుమీ యప్పిచ్చుట
    లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
  81. కందం
    కవిగానివాని వ్రాఁతయు
    నవరసభావములు లేని నాతుల వలపుం
    దవిలి చను పందినేయని
    వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ!
  82. కందం: 94%(37/39)
    కసుగాయఁ గరచి చూచిన
    మసలక తన యోగరుగాక మధురంబగునా?
    పసగలుగు యువతులుండఁగఁ
    బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    24మాత్ర45
    23ఆరవ గణంజ or నలస
    గణ విభజన
    ✔స నల భ
    | | U | | | | U | |
    క సు గా యఁ గ ర చి చూ చి న
    ✘నల స స నగ స
    | | | | | | U | | U | | | U | | U
    మ స ల క త న యో గ రు గా క మ ధు రం బ గు నా
    ✔నల నల భ
    | | | | | | | | U | |
    ప స గ లు గు యు వ తు లుం డఁ గఁ
    ✔స స జ నల స
    | | U | | U | U | | | | | | | U
    బ సి బా ల లఁ బొం దు వాఁ డు ప శు వు ర సు మ తీ
  83. కందం
    కరణము సాధై యున్నను
    గరి మద ముడిగినను బాము కరవకయున్నన్
    ధరదేలు మీటకున్నను
    గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!
  84. కందం
    కరణము గరణము నమ్మిన
    మరణాంతకమౌను గాని మనలేడు సుమీ
    కరణము తన సరి కరణము
    మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!
  85. కందం: 86%(33/38)
    కమలములు నీడఁ బాసినఁ
    గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్
    దమ దమ నెలవులు దప్పినఁ
    దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    4గణాల సంఖ్య54
    43మాత్ర46
    44మాత్ర45
    45మాత్ర40
    44యతిదము
    గణ విభజన
    ✔నల జ భ
    | | | | | U | U | |
    క మ ల ము లు నీ డఁ బా సి నఁ
    ✔స స జ నల గా
    | | U | | U | U | | | | | U U
    గ మ లా ప్తు ని ర శ్మి సో కి క మ లి న భం గిన్
    ✔నల నల భ
    | | | | | | | | U | |
    ద మ ద మ నె ల వు లు ద ప్పి నఁ
    ✘స నల రల నగ
    | | U | | | | U | U | | | | U
    ద మ మి త్రు లు శ తృ లౌ ట త థ్య ము సు మ తీ
  86. కందం
    కప్పకు నొరగాలైనను
    సప్పమునకు రోగమైన సతి తులువైనన్
    ముప్పున దరిద్రుడైనను
    దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!
  87. కందం: 94%(37/39)
    కనకపు సింహాసనము
    శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ
    దొనరఁగ బట్టముగట్టిన
    వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర43
    25మాత్ర43
    గణ విభజన
    ✘నల గా న
    | | | | U U | | |
    క న క పు సిం హా స న ము
    ✘నల గా జ స న
    | | | | U U | U | | | U | | |
    శు న క ముఁ గూ ర్చుం డ బె ట్టి శు భ ల గ్న ము నఁ
    ✔నల భ భ
    | | | | U | | U | |
    దొ న రఁ గ బ ట్ట ము గ ట్టి న
    ✔నల స జ స స
    | | | | | | U | U | | | U | | U
    వె న క టి గు ణ మే ల మా ను వి న రా సు మ తీ
  88. కందం: 94%(37/39)
    కడు బలవంతుడైనను
    బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం
    దడవుండనిచ్చె నేనియు
    బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    12మాత్ర46
    13మాత్ర41
    గణ విభజన
    ✘నల రల ల
    | | | | U | U | |
    క డు బ ల వం తు డై న ను
    ✔నల గా జ భ గా
    | | | | U U | U | U | | U U
    బు డ మి ని బ్రా యం పు టా లి బు ట్టి న యిం టం
    ✔స జ భ
    | | U | U | U | |
    ద డ వుం డ ని చ్చె నే ని యు
    ✔నల భ జ భ స
    | | | | U | | | U | U | | | | U
    బ డు పు గ నం గ డి కి దా నె పం పు ట సు మ తీ
  89. కందం
    ఓడల బండ్లును వచ్చును
    ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును
    ఓడలు బండ్లును వలెనే
    వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!
  90. కందం
    ఒల్లనిసతి నొల్లనిపతి
    నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
    గొల్లండు గాక ధరలో
    గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!
  91. కందం
    ఒకయూరికి నొక కరణము
    నొక తీర్పరియైనఁ గాక వొగిఁదరుచైనం
    గకవికలు గాక యుండునె
    సకలంబును గొట్టువడక సహజము సుమతీ!
  92. కందం
    ఏరకుమీ కసుగాయలు
    దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ
    పారకుమీ రణమందున
    మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
  93. కందం
    ఎప్పుడు సంపద కలిగిన
    అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
    దెప్పలుగ జెరువునిండిన
    గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
  94. కందం
    ఎప్పుడు దప్పులు వెదకెడు
    నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్
    సర్పంబు పడగనీడను
    గప్పవసించిన విధంబు గదరా సుమతీ!
  95. కందం
    ఉపకారికి నుపకారము
    విపరీతముగాదు సేయ వివరింపంగా
    అపకారికి నుపకారము
    నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
  96. కందం
    ఉదకము ద్రావెడు హయమును
    మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
    మొదవుకడ నున్న వృషభము
    జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!
  97. కందం: 97%(41/42)
    ఉత్తమ గుణములు నీచు
    కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా
    నెత్తిచ్చి కరగిపోసిన
    నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ!
    తప్పులు
    పాదముస్థానముతప్పు పేరుకావలసినది(వి)ఉన్నది(వి)
    13మాత్ర43
    గణ విభజన
    ✘భ నల హ
    U | | | | | | U |
    ఉ త్త మ గు ణ ము లు నీ చు
    ✔భ నల జ భ గా
    U | | | | | | | U | U | | U U
    కె త్తె ర గు న గ లు గ నే ర్చు నె య్య డ లం దా
    ✔గా నల భ
    U U | | | | U | |
    నె త్తి చ్చి క ర గి పో సి న
    ✔భ గా నల స స
    U | | U U | | | | | | U | | U
    ని త్త డి బం గా రు మ గు నె ఇ ల లో సు మ తీ
  98. కందం
    ఉడుముండదె నూరేండ్లును
    బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్
    మడుపునఁ గొక్కెర యుండదె
    కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!
  99. కందం
    ఇమ్ముగఁ జదువని నోరును
    అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్
    దమ్ములఁ బిలువని నోరును
    గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
  100. కందం
    ఆఁకొన్న కూడె యమృతము
    తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
    సోఁకోర్చువాఁడె మనుజుఁడు
    తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
  101. కందం
    అల్లుని మంచితనంబును
    గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
    బొల్లున దంచిన బియ్యముఁ
    దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
  102. కందం
    అప్పుగొని సేయు విభవము
    ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
    దప్పురయని నృపురాజ్యము
    దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!
  103. కందం
    అడియాస కొలువుఁ గొలువకు
    గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్
    విడువక కూరిమి సేయకు
    మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!
  104. కందం
    అడిగిన జీతంబియ్యని
    మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
    వడిగల యెద్దుల గట్టుక
    మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!
  105. కందం
    అక్కరకు రాని చుట్టము,
    మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
    నెక్కినఁ బారని గుర్రము,
    గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
  106. కందం
    శ్రీరాముని దయచేతను
    నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
    ధారాళమైన నీతులు
    నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!