కృతజ్ఞతలు

  1. ప్రత్యేక కృతజ్ఞతలు : శ్రీ K.నాగ భూషణరావు గారు (ఆంధ్రభారతి) - నా దగ్గర లేని ఎన్నో ఉదాహరణలను సేకరించి ,ప్రతీ పద్య లక్షణాలను వ్యక్తిగతంగా సరిచూసి , చిన్న చిన్న అక్షర దోషాలను కూడ సవరించి ఇచ్చినందుకు.
  2. శ్రీ ఊలపల్లి సాంబశివరావు గారు: పోతన భాగవతంలోని పద్యాలను అన్నీ అడుగగానే ఇచ్చి, ఈ application లోని తప్పుఒప్పులను ఎత్తి చూపినందుకు.
  3. శ్రీమతి లక్ష్మీదేవిగారు: మాలతీమాధవం , మందాకిని , మనోభిరామం , మా వంటా-వార్పు ఛందం © మొట్టమొదటి వాడుకరిగా సూచనలు,సలహాలు ఇచ్చినందులకు
  4. శ్రీ అంబరీష దర్భా: వెన్ను తట్టి ప్రోత్సహించినందుకు,ఆయన తయారు చేసిన ఖతులను ఉపయోగించుకొనేందుకు అనుమతించినందుకు.
  5. శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావు గారు అంతర్జాలంలో ఎన్నో వ్యాసాలు ఛందస్సుపై వ్రాసి అందించినందుకు.
  6. శ్రీ కోవెల సంపత్కుమారాచార్యులవారి "ఛందఃపదకోశం"
  7. మాష్టర్స్ వారి తెలుగు వ్యాకరణపుస్తకం
  8. సంస్కృత భాషావనరులు. Refer
  9. శ్రీ మల్లిన నరసింహరావు గారు మరియు శ్రీ రాకేశ్వర్ గారు: శ్రమ తీసుకొని Wiki లో విశేష వృత్తాలను ఉంచింనందుకు
  10. శ్రీ మురళీ కోరిమిల్లి : నా మిత్రుడు మరియు సహోద్యోగి ఇచ్చిన ప్రోత్సాహం అమోఘం.
  11. చిరంజీవి ఫణి ప్రదీపు(అర్జును): ఈ ఐడియా ఇచ్చినందుకు (2008)
  12. చిరంజీవి సందీపు: దీనిని టెస్టు చేసినందుకు
  13. చివరగా నా శ్రీమతి అనురాధ: చెప్పలేని కారణాలు ఎన్నో ఎన్నెన్నో
  14. ఎందరో మహానుభావులు: అంతర్జాలం లో తెలుగు పుస్తకాలను,పద్యాలను , వ్యాసాలను ఉంచి నా శ్రమను తగ్గించినందుకు.

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.