ప్రశంసలు-విమర్శలు
ఛందం © పై వివిధ మాధ్యమాల ద్వారా వచ్చిన కొన్ని ప్రశంస-విమర్శల సంకలనం
ఛందం © సైట్ నాకు ఉపయోగపడుతూనే ఉంది. నేను వ్రాస్తున్న పద్యాలన్నింటినీ ఛందం ©లో పరీక్షించుకుంటూనే ఉన్నా. అదీకాక నాకు తెలియని కొత్త వృత్తాలను వాటి లక్షణాలతో సహా ఉంచినందుకు వాటిని నేను నేర్చుకుంటున్నా. ఇంకోటి ఉదాహరణ పద్యాలనివ్వడం వలన వాటి నడక ఎలా ఉంటుందో తెలియడం కూడా ఎంతో ముఖ్యమైన సహాయమే.
-శ్రీమతి లక్ష్మీ దేవి
చాలా అద్భుతమైన సాధనం; పద్యాల గణనకు చాలా అనుకూలంగా ఉంది.
-శ్రీ ఊలపల్లి సాంబశివరావు
Dileep Miriyala గారి చందం సాఫ్ట్ వేర్ ఉపయోగించి నాలాంటి ఔత్సాహికులు చాలా మంది తేలికగా పద్యాలు అల్లగలిగాము అనడం అతిశయోక్తి కాదు. ఈరోజు ఆయన జన్మదినం కాబటి ఆయన సాఫ్ట్ వేర్ ని ఉపయోగించుకున్న అభిమానంతో నేను ఆయనకి అందిస్తున్న చిన్నపాటి కానుకకందములో జడ శతకము
అందముగ కవులు ఎటులిట అల్లితిరనగా
అందరు ఎరుగును గదరా
చందం సాఫ్ట్వేరు వలన చిందిన శిల్పాల్
-శ్రీనివాస్ ఈడూరి
ఛందములనుసరిజూచెడి
సుందరగణకపునుపాయసూత్రమయంబౌ
పొందగునల్గారిదముల
నందెపుహస్తంబునీదినపర దిలీపా
-శ్రీ సూర్యనారాయణ సరిపల్లి గారు.
స్వరం ఆధారంగా సంధియుత యతి మైత్రి గుర్తింపు శాంత ప్రాసను పరిగణింపు విధములో ఛందం సాఫ్ట్ వేర్ కి కొందరి పండితుల అపేక్ష కు భేదము లగు పడుచున్నవి . ఛందం © ఏకీభవించననూ పండితులు తప్పనుచున్నారు .ఈ విషయం పండితులు /నిపుణులు తేల్చితే కొంత మేలు చేసిన వారగుదురు.
-శ్రీ BSS ప్రసాద్
[తరచుగా అడిగే ప్రశ్ర్నలు(FAQ) చూడండి.]
ఛందం © సాఫ్టువేరే గనుక Dileep Miriyala గారే గనుక అందుబాటు చేసి ఉండకపోతే, నాలాంటివారికి రచనలు ఏవైనా ఛందసులో ఇముడుతాయా అని వెదకడం ఏమాత్రమూ సాధ్యపడేది కాదు. ఖచ్చితంగా ప్రయత్నించేవాణ్ణే కాదు. [..] మనవంటివారికి ఇటువంటి పరికరాన్ని అందజేసిన దిలీప్ మిరియాలగారికి మరోసారి నాలాంటివారందరితరపునా శతకోటి ధన్యవాదాలు. ఇటువంటి సాఫ్టువేరులో ఉన్న కాంప్లికేషను తెలిసినవాడిగా ఆయనను అభినందించలేకుండా వున్నాను. ఆయనకు ఏదైనా అవార్డు ఇప్పించి తీరవలసినదే.
-శ్రీ శ్రీనివాస భరద్వాజ కిషోర్
బావుంది. మీరు చేసి కృషి కష్టసాధ్యం. సరే.. చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. శందస్సుకు సంబంధించిన మౌలిక లక్షణాలను చాలా వాటిని ఇందులో చేర్చవలసి ఉంది. రేఫ విషయంలో సిద్ధసమాసంలో ముందు వర్ణం గురువు అవుతుంది. ఇదీ కొన్నింటికి సడలింపు ఉంది. దీనికి సంబంధించిన నియమాలు స్పష్టంగా ఉన్నాయి. వాటిని జోడిస్తే ఈ సమస్య తీరుతుంది.
-శ్రీ డా. అద్దంకి శ్రీనివాస్
[తరచుగా అడిగే ప్రశ్ర్నలు(FAQ) చూడండి.]
తెలుగుఛందమునకు వెలుగులనిచ్చిన
తెలుగు కవుల పలుకు తేటమయ్యె
వీవనుండుతెచ్చె నవగణకంబును
పద్యవిద్యలెల్ల పరిఢవిల్ల!
-శ్రీ ఆనందీశ్వర రెడ్డి ఆషన్నగరి
తప్పకుండా దిలీప్ . నీ ప్రయత్నమూ నిజముగా భాషాభిమానులకు ప్రాతఃస్మరణీ యము . పరమేశ్వరుడు నీచే ఇంకా ఎన్నెన్నో విధములుగా భాషా సేవ చేయించు గాక . మాకు వయసు మీరినది . మీ బోటి వారు చేస్తూవుంటే చూసే వయసు మాది . మా కంప్యూటరు పరిజ్ఞానము కూడా అంతంతే . మరోకసారి భగవంతుని నీ ఆయురారోగ్య ఐశ్వర్యాలకై ప్రార్థించు చున్నాను .
-శ్రీ చెఱకు రామమోహనరావు
ఈ యంత్రం గురించి విననాను. చాలా గొప్ప ప్రయత్నం.
-శ్రీ సుబ్బాచారి పులికొండ
నావంటివారికి “ఛందం” సాఫ్టువేరు చాలా ఉపయోగపడుతూంది. అందుకే ఇటువంటి పరికరం మనకు అందజేసిన దిలీప్ గారికి సరదాగా అంకితం ఈ కింది పద్యాలు - ఊహ మాత్రమే సుమా. ఒకనాడు కలలో కనిపించివిన్నదినిజమేనానేఅని
నెన్నడు నివురాయగలవ నేయనుకోలే
దన్నివిధులనేబూనితి
నన్నటులేపద్యమల్లి నావేనీవేనన్నయ అతివిస్మయమున
నన్నడుగగ పద్యములిటు నల్లగలుగగన్
ఉన్నతమౌ ఛందం వున్ ("Chandam" web app)
దన్ననిజముచెప్పితినిక దాచగలేకన్పొందుపరచినదిలీపుడుఅని నేను చెప్పగానే, నీలాంటివారుకూడా పద్యాలు వ్రాస్తున్నారంటే, ఈ పరికరం చలువే అని,
అందరికీనందుబాటు అగునటుచేసెన్
ఛందము నిండిన పద్యము
నందముగాకూర్చుటకిది ఐనదవసరమ్హన్నాఇదికలియుగమేఅని దిలీపుణ్ణి మనసారా దీవించాడు నన్నయ(నన్నయ్యే అనుకుంటాను కలలో కనిపించిన ఆయన )
ఉన్నాయిటువంటిమంచి ఉపకరణములే
ఇన్నేళ్ళుగలేనివసతి
ఇన్నాళ్లకుఇచ్చినట్టి ఈతడుఘనుడే
-శ్రీ శ్రీనివాస భరద్వాజ కిషోర్
వీటిని కూడా చూడండి.
పద్యాన్ని గణించండి...!!
యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.
ఉపకరణాలు
కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.