బ్లాగు
- 11th Feb 2014
- స్వరం ఆధారంగా సంధియుత యతి మైత్రి గుర్తింపు సంధి వల్ల
ఏర్పడిన స్వరం ను ఆధారంగా చేసుకొని యతిని గుర్తించే పద్దతి ఇది. సంధి అనేది గురించాలంటే
ముఖ్యంగా
- Algorithm కు పదాలను గుర్తించే సామర్ధ్యం కావాలి.
- పదోత్పత్తి ఎలా జరుగుతుందో తెలియాలి.
- వచనాల గుర్తింపు ఏ పద్యం తోనూ సరిపోల్చలేనపుడు దానిని వచనం/కవిత/పాట/గద్యం/గుర్తు తెలియని ఛందో/సాహిత్య ప్రకియ గా mark చేయడం జరుగుతుంది ఇకపై. (Base Rule:<50% Match)
- స్వరం ఆధారంగా సంధియుత యతి మైత్రి గుర్తింపు సంధి వల్ల
ఏర్పడిన స్వరం ను ఆధారంగా చేసుకొని యతిని గుర్తించే పద్దతి ఇది. సంధి అనేది గురించాలంటే
ముఖ్యంగా
- 31st Jan 2014
- సమీప ఫలితాల ప్రదర్శన దేవీ గారు,సాంబశివరావుగారు లేవనెత్తిన సందేహం నన్ను ఒక్కసారిగా defense లోకి నెట్టి వేసింది. ఇంతకి అది ఏమిటంటే ఒక్కోసారి తెలుసున్న పద్యాన్ని గణించినపుడు వేరే ఏదో పద్యరకంగా చూపిస్తోంది. సంధి మూలకంగా వచ్చే యతులను సరిగ్గా గుర్తించలేకపోవడమే అసలైన కారణం. మూల్యాంకనం అనే బొత్తంను (Button) ను నొక్కి ఎందుకు వేరే పద్యం గా గుర్తించిందో తెలుసుకోవచ్చు. కానీ ఇది అంత clear గా ఉన్నట్టు లేదు. .So యతి గుర్తింపుకి కొంత తక్కువ weight ఇవ్వాలి కానీ అప్పుడు అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా తోస్తోంది. ఇంకా re-search చేయాల్సి ఉంది . అప్పుడు కూడా ఇదే సమస్య వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది.మధ్యేమార్గంగా ప్రస్తుతానికి సమీప ఫలితాలను కూడా గణనం fail అయ్యినపుడు చూపించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు అనుకుంటున్న పద్యరకం ఈ సమీప ఫలితాలలో కనుక ఉంటే దానిపై నొక్కి ...తో గణించు బొత్తము నొక్కి గణం సరి చూసుకోవచ్చు.ఇవేవి చేయకుండా simpleగా యతి,ప్రాస గణనాలను తీసివేసి ఎలానూ గణించుకోవచ్చు.
- మరింత వేగవంతమైన సమర్ధనీయమైన ఫలితాలు ఇంతకు ముందు చెప్పినట్టుగా కాకుండా Core Matching Engine లో మార్పులు చేసాను. దీనివల్ల ఫలితాలు మరింత వేగంగా వస్తున్నాయి. ఉదాహరణకు తురగవల్గన రగడ పద్యాన్ని(ఉదాహరణ పద్యం దశరథావనీశ ..... చూడుము ) గణించడానికి 6.5 సెకన్ల వరకు పట్టేది పాత గణన పద్దతిలో కానీ కొత్త గణన పద్దతి లో కేవలం అర సెకను లో గణించగలుగుతోంది(Windows 7 Internet Explorer 11, RAM: 4GB,Intel Core I5). ఫలితం సరైనది కాదు అనుకొంటే పాత గణన పద్దతి లో గణించు కోవచ్చు. ఈ ఫలితాలు విరాహిణి బట్టి వేరుగా ఉండవచ్చు కానీ రెండుగణనాల ఫలితాలను పోల్చి చూసినపుదు కనీసం సరాసరిగా 100% కంటే ఎక్కువ తేడా ఖచ్ఛితంగా ఉంది. మరింత ఎక్కువ వేగంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తోస్తోంది కానీ 1 సెకను కంటే తక్కువ కాలంలో ఫలితం వచ్చినా వాడుకరికి పెద్ద తేడా కనిపించదు కనుక మరింత కృషి ప్రస్తుతానికి చేయడం లేదు.
- సాధారణమైన మార్పులు - చేర్పులూ ఛందోరాజం ను మరింత గా అభివృద్ధి చేసాను. ఇప్పుడు జాతి,ఉపజాతి పద్యాలకు కూడా పాదాక్షరాల సంఖ్య ఫరిధుల లో చూపిస్తున్నాను. 19 దండకాలను కొత్తగా కలిపాను. ఇంతకు ముందు వీటి సంఖ్య రెండు. శ్రీ నాగభూషణరావు గారు చాలా ఉదాహరణలను సరి చేసి ఇచ్చారు. అవి సరి చేసాను.
- అసమ/విషమ/ఉధ్ధూర మాలా వృత్తాలు నాకు చాలా confusing గా ఉన్నాయి. మరికొన్ని ఇవేగాక జతి,ఉపజాతులను కలపాల్సి ఉంది.
- Bulk ఛందోగణనం మీద పనిచేయాల్సి ఉంది.
- 14th Jan 2014
- మరొక 47 పద్య రకాలను, కొన్ని పద్య రకాలలో కొత్త ఉదాహరణ పద్యాలను కూడా కలపడం జరిగింది. మొత్తం 293+ పద్య రకాలు ఉన్నాయి ఇప్పుడు. అత్యష్టి (17) ఛందము వరకూ 'ఛందః పదకోశం ' లో గల పద్య రకాలను verify చేసి లేని వాటిని కలిపాను.
- చాలా పద్యాలకు యతి స్థానాలను correct లేదా కలిపాను.
- ఉదాహరణలు+యతి స్థానాలు లేని పద్యరకాలను తీసివేద్దామని ఆలోచిస్తున్నాను.
- ఇప్పుడు యాదృఛ్చిక పద్యం 479 పద్యాల నుండి ఎన్నుకోబడుతుంది.
- ఛందోరత్నావళి లో కొన్ని పద్యరకాలు రావడంలేదు అవి కలిపాను.
- పద్యరకాలు పెరగడం వల్ల ఫలితాలు కొంచెం నెమ్మదిగా రావచ్చు అందుకోసం Simple Mode (చాలా Frequent గా తెలుగు సాహిత్యం లో ఉపయోగించేవి ), Advanced Mode(అన్ని రకాల పద్య రకాలు ) అని ఉంచితే బాగుంటుందేమోనని అలోచిస్తున్నా. ఎందుకంటే Core Matching Engine లో మార్పులు చేసే ఉద్ధేశ్యం లేదు. లేదా ఫలితాల వేగం బాగానే ఉంది అని అనిపిస్తే ఏమార్పులు చేయను. మీ observations కూడా చెప్పండి.
- 12th Jan 2014
- మరొక 23 పద్య రకాలను కొన్ని పద్య రకాలలో కొత్త ఉదాహరణ పద్యాలను కూడా కలపడం జరిగింది. మొత్తం 246+ పద్య రకాలు ఉన్నాయి ఇప్పుడు. (+) అనేది ఏదేని వృత్తపద్యం రకమును ,ఇంకా కొత్త ఛందస్సును తయారు చేసుకొనే అవకాశాన్ని సూచిస్తుంది. అనుష్టుప్పు (8) ఛందము వరకూ 'ఛందః పదకోశం ' లో గల పద్య రకాలను verify చేసి లేని వాటిని కలిపాను.
- ఇప్పుడు యాదృఛ్చిక పద్యం 380 పద్యాల నుండి ఎన్నుకోబడుతుంది.
- ప్రాసాగణనాన్ని improve చేసి test చేసాను. శాంతప్రాస విషయంలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందువల్ల default గా Enable చేయడం లేదు.Explicit గా select చేసుకోవాలి.
- ప్రయోగాలు
- ప్రయోగాలు అనే కొత్త Itemను Enable చేసాను. దీనిలో ♬♫ స,రి,గ,మ,ప,ద,ని ♫♬ లతో అనంతమైన కంద,సమ వృత్త పద్యాలను తయారు చేసుకోవచ్చు.
- ఛందమునకు గల ఛందస్సులు ఎన్ని ఉండునో లెక్క చూసుకోవచ్చు. ఛందమునందు ఇచ్చిన సంఖ్య కు గల ఛందస్సు యొక్క గణములు ఏమిటో కూడా తెలుసు కోవచ్చు. ఈ రెండు గణనాలు ఛందస్సు Basics లో చెప్పే లెక్కలు. Of course pure Maths.
- ప్రాస,యతి లను సరిచూసుకోవచ్చు. ఇంకా అవి ఏ రకమైన యతి(ప్రాస యతి తో సహ).ప్రాస లో తెలుసు కోవచ్చు.
- దీనిని ప్రయోగాలు అని పిలిచే బదులు Tools అని పిలవాలి ఏమో. కానీ 'స,రి,గ,మ ...' లతో పద్యం ప్రయోగమే కదా. ఇంకా అలోచించాలి.
- ఎప్పటిలానే కొన్ని Bugs Fix చేసాను
- నాసోది కొంత
- శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు చేసిన ఛందఃప్రయోగాలు మీద చేసిన ఒక Phd. పుస్తకం దొరికింది. అయన ఈ ఆధునిక యుగం లో పుట్టిన మహర్షే. ఆయన పద్యాలను అర్ధం చేసుకొనే భాషాఙ్ఞానం నాకు లేక పోవడం నా దురదృష్టం కానీ ఈ జన్మలో రామాయణ కల్పవృక్షం లో కనీసం ఒక్క కాండను నేను అర్ధం చేసుకోగలిగితే చాలు.
- 6th Jan 2014
- శ్రీ K.నాగ భూషణరావు గారు (ఆంధ్రభారతి)ప్రాసాగణనం లో మరి కొన్ని రూల్స్ పంపించారు. అంటే మరికొంత కృషి చేయాలన్న మాట ప్రాసాగణనం లో.
- ఎన్నోవ వృత్తం?
- ఛందం© ఇప్పుడు ఎన్నోవ వృత్తం మో కూడా చెప్పగలుగుతుంది
ఉదా: ఉత్పలమాల: కృతి ఛందమునకు చెందిన 355799 వ వృత్తము.
పైన చెప్పిన 355799 అనే సంఖ్య ను గణించే పద్దతి ఛందం©కు నేర్పాను. - ఈ గణనను కొన్ని పద్య రకాలకే సరి చూసాను.
అందువల్ల ఈ గణన లో కూడా తప్పు ఉంటే ఉండవచ్చు.[Update on 14th Jan 2014] - ఈ సంఖ్యాగణనం ఛందం©లోని పద్య రకాలకే కాకుండా కొత్త ఛందస్సులకు కూడా వస్తుంది.
- ఈ సంఖ్య ఇప్పుడు పద్యలక్షణాలలోనూ,ఛందోరాజం,ఛందోరత్నావళి లలో కూడా లభ్యం అవుతుంది.
- ఛందం© ఇప్పుడు ఎన్నోవ వృత్తం మో కూడా చెప్పగలుగుతుంది
- 5th Jan 2014
- ప్రాసాగణనం ఛందఃపదకోశం పుస్తకంలోవి అన్ని చదివి , నోట్సు వ్రాసుకొని, కోడింగు కూడా పూర్తి చేసాను. వేరే పుస్తకాలు కూడా చూడాలి Gaps ఏమైనా ఉండవచ్చు.
- Parallel గా కొన్ని కొత్త ఛందస్సులు Configure చేస్తున్నాను. అవి ఇంకా publish చేయడం లేదు.
- ఇప్పుడు కొత్త ఛందస్సు లక్షణాలను వాటిని తయారు చేసుకున్న వారు వాళ్ళ Email అడ్రెస్‌కు కూడా share చేసుకోవచ్చు.
గురు లఘువుల నిర్ణయం లో ఒక తప్పు ఇవాళ కనిపించింది. అది సరి దిద్దాను. ఎలా ఆ తప్పు దొరకకుండా తప్పించుకుందో తెలియదు ఇన్నాళ్ళు.నిన్న తప్పు అనుకున్నది ఇవాళ తప్పుకాదు అని తెలిసింది. నిజాలు verify చేయకుండా తొందరబడి రూల్ వ్రాసాను.[Update on 6th Jan 2014]- వేరే important పనులు కూడా ఈ వారంలో పడ్దాయి అందువల్ల పెద్దగా progress లేదు.మరోవారం కూడా ఇలాగే ఉండవచ్చు.
- ఉగాదికి ఛందం© రిలీజ్ target చేస్తున్నాను.
- 1st Jan 2014
- ఛందోరత్నావళి పుస్తకాన్ని improve చేసాను.
- ప్రాసాగణనం నేర్చుకుంటున్నాను. ఇది చాలా సంక్లిష్టమైనదని అర్ధం అవుతోంది. నేను చాలా తక్కువ అంచనా వేసాను. మరింత జాగ్రత్తగా అర్ధం చేసుకొని చేయవలసి ఉంది. నేను ప్రాస గణన లో 20% కూడ పూర్తి చేయలేదని అర్ధం అయ్యింది. ప్రాస ని అర్ధం చేసుకొనే వరకూ ఛందం© కు సెలవు. ఒక వారం, పది రోజులు పట్టవచ్చేమో. యతి లానే దీనికి కూడా నోట్స్ వ్రాసుకోవాలి, కోడ్ చెయ్యాలి. ఛంధః పదకోశం,అనంతుని ఛందం వివరణ పుస్తకం దొరకడం నా పాలిట వరాలే.
- 31st Dec 2013
- సొంతముగా ఛందములను తయారు చేసుకోగలిగే సౌకర్యం కల్పించబడింది. ఆ ఛందము లో వ్రాసుకున్న పద్యాలను కూడా గణించవచ్చు.
- కొన్ని Bugs ను కూడా Fix చేసాను.
- UI లో కూడా కొన్ని మార్పులు చేసాను.
- ప్రాస:
- ఒక(మొదటి పాదం మాత్రమే కాదు)పాదం లోని ప్రాసపూర్వాక్షరం గురువు అయితే అన్ని పాదాలలోనూ
గురువే కావాలి.
Simple గా అన్ని పాదాలలోనూ ప్రాసపూర్వాక్షరం ఒకే Symbol(గురువు/లఘువు) కావాలిమొదటి పాదం లోని ప్రాస పూర్వాక్షరం కనుక లఘువు అయితే మిగిలిన పాదాల్లో ప్రాసపూర్వాక్షరం గురువు కావచ్చు. నేను తప్పుగా అర్ధం చేసుకున్నాను.[Update on 1st Jan 2014] - సంయుక్తాక్షరం కనుక ప్రాసస్థానంలో వుంటే అన్నీ పాదాలలోనూ అదే వరుసలో రావాలి.అంటే ర్జు కు ర్జి,ర్జూ,ర్జా లు ప్రాస కు సరి పోతాయి. కానీ జ్రు , జ్రా లు ర్జు కు ప్రాస గా కుదరవు.
- ఒక(మొదటి పాదం మాత్రమే కాదు)పాదం లోని ప్రాసపూర్వాక్షరం గురువు అయితే అన్ని పాదాలలోనూ
గురువే కావాలి.
- నా సోది: 30 న ఒక ముఖ్యమైన పరీక్ష వ్రాసాను, అది అంతకు ముందు వ్రాసినపుడు fail అయ్యాను. కాబట్టి ఈ సారి చాలా Serious గా concentrated గా సిద్దం కావాల్సి వచ్చింది. శ్రమ ఫలించింది. ఆ పరీక్ష ఫలితం నేనే నమ్మలేనంత గొప్పగా వచ్చింది. కాబట్టి సంతోషం గా 2013 కు వీడ్కోలు చెప్పవచ్చు.
- 22nd Dec 2013 to 30th
Dec 2013
- నాకు చాలా ముఖ్యమైన పని ఉన్నది కావున 30 డిసెంబరు 2013 వరకూ ఛందం© లో ఏమి మార్పులు ఉండవు.ఓపికగా ఉండగలరు.
- 21th Dec 2013
- మిరియం© ఇప్పుడు అయ్యింది ఛందం©
- User interface కు కొన్ని మార్పులు చేసాను.Feedback బాగుంటే ఇలాగే ఉంచుతాను.
- ఛందస్సు నేర్చుకొనే వాళ్ళ కోసం ఛందోరాజం,ఛందోరత్నావళి అనే రెండు పుస్తకాలు add చేసాను.
వీటిని కూడా చూడండి.
పద్యాన్ని గణించండి...!!
యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.
ఉపకరణాలు
కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.