చరిత్ర:
- 2008లో దీనికి పునాది పడింది.కానీ అప్పట్లో శార్ధూల వృత్తాన్ని మాత్రమే గుర్తించగలిగేది.దాని వల్ల పెద్ద ఉపయోగం లేదు.
- 2013లో కచ్చితంగా పూర్తి చేయాలనే సంకల్పం తో 80% వరకూ పూర్తి చేయగలిగానని అనుకుంటున్నాను.
- ఛందస్సు నేర్చుకోవడానికి చేసిన వెతుకులాటలో ఈమధ్యనే హారం వారి applicaition కూడా చూసాసు.నా ఉద్దేశ్యం లో అది ఒక గొప్ప మొలక.
- ఆంధ్రభారతి వారు ఒక private offline application ను ఇదివరలో తయారు చేసివున్నారు.
- ఈ విధమైన ఒక సాఫ్టువేరులు ఇంకా ఉన్నాయేమో నాకు తెలియదు.
- 2008లో నేను రాసుకున్న Core Framework ను improve చేసి మిరియం ను తయారు చేసాను.
- దీనిని C# పోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వ్రాయడం జరిగింది. 2008 లో నేను C# కోడ్ కు equivalent 'Javascript'ను Manual గా వ్రాసుకున్నాను.కానీ ఇప్పుడు Javscript ను వదిలేసి పూర్తిగా C# లో వ్రాసాను.
- Script Sharp ను వుపయోగించి Javascript లోకి కంపైల్ చేసాను.
- కాబట్టి నా వద్ద Server Script మరియూ Client Script రెండూ వున్నాయి.
వీటిని కూడా చూడండి.
పద్యాన్ని గణించండి...!!
యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.
ఉపకరణాలు
కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.