అంకితం

తేట తెలుగు

ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోననుండి
అమ్మ పాట పాడినట్టి భాష
తేనెవంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!
సంస్కృతంబులోని చక్కెర పాకంబు,
అరవభాషలోని అమృతరాశి,
కన్నడంబులోని కస్తూరి వాసన,
కలిసిపోయె తేట తెలుగునందు.
వేనవేల కవుల వెలుగులో రూపొంది
దేశదేశములను వాసిగాంచి
వేయి యేండ్లనుండి విలసిల్లు నా “భాష”
దేశ భాషలందు తెలుగు లెస్స!

అని చాటిన మా పెద్దనాన్నగారు డా.శ్రీ మిరియాల రామకృష్ణ(మిరా)గారికి అంకితం. (మిరా గా సుపరిచితులు) సుప్రసిద్ద రచయిత. శ్రీశ్రీ గారి కవితాశైలిపై ఆంధ్రా యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ పొందినారు.( మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి. )

  1. మిరా కవితలు కొన్ని
  2. Google మిరియాల రామకృష్ణ
  3. బాలసాహిత్యం: దక్షిణ భారత దేశ పుస్తక అవార్డు(1965): బాలాభిరామం

పద్యాన్ని గణించండి...!!

యొక్క ప్రధానలక్ష్యం వాడుకరి చెప్పిన పద్యాన్ని గణించి అది ఏ ఛందస్సో కనిపెట్టడం మరియూ అందులోని ఛందోనియమాలను ఉల్లంఘించిన దోషాలను ఎత్తిచూపించడం. మరి మీదగ్గర ఉన్న లేదా వ్రాయబోతున్న పద్యమును గణించండి.

ఉపకరణాలు

కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది. దీనిలో కొన్ని ఛందస్సుకు సంబంధించి కొన్ని సాంకేతిక కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ ♫♬ లతో పద్యం రాయించడం.

ఛందం© తో పద్య సాహిత్యం మరింత రసమయం..!!

 
ఛందం© ఫలితాలపైనే పూర్తిగా అధారపడవద్దు. స్వవిచక్షణతో నిర్ణయం తీసుకోగలరు.